జియో నుంచి 4ఎక్స్ బెనిఫిట్స్ ఆఫర్.. రూ.249ల కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే..?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (12:39 IST)
ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా అద్భుతమైన ఆఫర్‌ను జియో ప్రకటించింది. ఇందులో భాగంగా '4ఎక్స్ బెనిఫిట్స్ ఆఫర్' అంటే నాలుగు రెట్లు లాభాలు పొందండి అంటూ యూజర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఈ ఆఫర్ జూన్ నెలలోనే ఉంటుంది. 
 
జూన్‌లో జియో యూజర్లు రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్స్‌తో పాటు మరిన్ని లాభాలు పొందొచ్చు. ఇందుకోసం రిలయెన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, ఏజియోలతో ఒప్పందం కుదుర్చుకుంది జియో. రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయగానే మైజియో యాప్‌లో కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కూపన్స్ క్రెడిట్ అవుతాయి. 
 
అడ్వాన్స్ రీఛార్జ్ చేసేవారు కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. అంటే మీ ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ పూర్తి కాకపోయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లో మై ప్లాన్స్ సెక్షన్‌లో మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ క్యూలో ఉంటుంది. పాత ప్లాన్ గడువు పూర్తైన తర్వాత కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. జూన్ 30 లోపు రీఛార్జ్ చేసేవారు మాత్రమే ఈ ఆఫర్స్ పొందడానికి అర్హులని జియో ప్రకటించింది. 
 
ఈ రీఛార్జ్ ద్వారా యూజర్లు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్‌పై డిస్కౌంట్స్ పొందొచ్చు. రూ.249 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి డిస్కౌంట్ కూపన్స్ లభిస్తాయి. వాటిని రిలయెన్స్ స్టోర్లలో ఉపయోగించుకుని డిస్కౌంట్ పొందవచ్చు. రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబర్లు, పాత, కొత్త యూజర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చునని జియో ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments