రిలయన్స్ జియో దీపావళి షాక్.. ఏంటో తెలుసా?

దీపావళి పండుగ రోజున రిలయన్స్ జియో తమ యూజర్లకు తేరుకోలేని షాకిచ్చింది. 84 రోజుల రూ.399 ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్‌‌లో ఈ విషయాలను తెలిపింది. ఈ టారిఫ్‌ల సవరింపు దీపావళి నుం

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (10:57 IST)
దీపావళి పండుగ రోజున రిలయన్స్ జియో తమ యూజర్లకు తేరుకోలేని షాకిచ్చింది. 84 రోజుల రూ.399 ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్‌‌లో ఈ విషయాలను తెలిపింది. ఈ టారిఫ్‌ల సవరింపు దీపావళి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 
 
84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు 1 జీబీ 4జీ డేటాను ప్రతిరోజూ పొందవచ్చని వివరించింది. దివాళీ ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న డేటాను 2జీబీ నుంచి 4జీబీకు పెంచుతున్నామని పేర్కొంది.
 
అయితే, షార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌లు, తక్కువ డినామినేషన్‌ రీచార్జ్‌ టారిఫ్‌లను రిలయన్స్‌ జియో తగ్గించింది. ఏడు రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్, ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని పేర్కొంది. 
 
రోమింగ్‌లో ఉన్నప్పటికీ, జియో… అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది. అంతేకాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు తగ్గించామని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్‌ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments