ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న చైనాలో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9 4జీ, రెడ్‌మి నోట్ 9 5జీ, రెడ్‌మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్‌ఫోన్లను చైనాలో విడుదల చేసింది. డిసెంబర్ 1 నుండి కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కానీ భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు.
1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్‌ఎం 2 సెన్సార్‌తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.