Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపిన రియల్మీ నార్జో 10 స్మార్ట్ ఫోన్

Webdunia
బుధవారం, 20 మే 2020 (14:59 IST)
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్మీ తాజాగా మరో కొత్త మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ మోడల్ పేరు రియల్మీ నార్జో10. ఈ ఫోనును ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి ఉంచారు. ఈ ఫోనును విక్రయానికి ఉంచిన కేవలం 128 సెకన్లలో ఏకంగా 70 వేల యూనిట్ల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ ఫోను ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.11999 వేలు.  
 
నిజానికి ఈ ఫోను మన దేశంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అపుడు నార్జో 10ఏ ఫోను ధర రూ.8499 మాత్రమే. కానీ, స్మార్ట్ ఫోను వినియోగదారులు మాత్రం ఫ్లిప్‌కార్టులో పోటీపడిమరీ నార్జో 10 రకం ఫోనును ఆర్డర్ చేశారు. 
 
దీనిపై రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ స్పందిస్తూ, 'ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు వేగం ఎంతో విలువైనది. #RealmeNarzo10 ఫోన్‌ను ఎంచుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. 
 
రియల్‌మీ నార్జో 10ఏ(ధర రూ.8,499) ఫోన్‌ విక్రయాలు మే 22 నుంచి ప్రారంభంకానున్నాయి. లాక్డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు స్తంభించిపోవడంతో వినియోగదారులు నూతన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments