Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో పోటీ దెబ్బ : ఒక్క రూపాయికే 300 నిమిషాల టాక్‌టైమ్.. ఆర్‌కామ్ స్పెషల్ ఆఫర్

అంబానీ సోదరుల మధ్యే టెలికాం పోటీ తారా స్థాయికి చేరింది. ఫలితంగా వినియోగదారులకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ జియో సేవలు దేశంలో పూర్తి స్థాయిలో అం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (14:23 IST)
అంబానీ సోదరుల మధ్యే టెలికాం పోటీ తారా స్థాయికి చేరింది. ఫలితంగా వినియోగదారులకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ జియో సేవలు దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో సంచలనాలు సృష్టిస్తోంది. 
 
ఈ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌‌తో పాటు.. అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అంటే కేవలం ఒక్క రూపాయికే 4జీ నెట్‌వర్క్ కింద 300 నిమిషాల పాటు యాప్-టు- యాప్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అమలులో ఉండనున్నది. 
 
అంటే రోజుకు 10 నిమిషాల చొప్పున 30 రోజుల వరకు 300 నిమిషాల పాటుకాల్ చేసుకునే అవకాశం లభించనున్నది. దీంతోపాటు వినియోగదారుడికి రోజుకు 7 మెగాబైట్స్ చొప్పున డేటా ఉచితంగా లభించనున్నదని ఆర్‌కామ్ సీఈవో గుర్‌దీప్ సింగ్ తెలిపారు. ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ -ఎన్.సి.ఆర్ పరిధిలోని ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. కాగా, ప్రస్తుతం సంస్థకు దేశంలో 11 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments