Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిపెద్ద సైబర్ అటాక్.. 100 దేశాల్లో హ్యాకైన కంప్యూటర్లు.. ఏపీలోనూ అదే పరిస్థితి.. ఆన్‌లైన్ ఆపండి!!

ప్రపంచంలో అతిపెద్ద సైబర్ అటాక్ చోటుచేసుకుంది. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. 300 డాలర్లు చెల్లించేతేనే తిరిగి కంప్యూటర్లు పనిచేస్తాయని సందేశాలు అందాయి. కంప్యూటర్లు లాక్ చేసి డబ్బు డిమాండ్ చేయడం సైబర్ అధి

Webdunia
శనివారం, 13 మే 2017 (12:00 IST)
ప్రపంచంలో అతిపెద్ద సైబర్ అటాక్ చోటుచేసుకుంది. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. 300 డాలర్లు చెల్లించేతేనే తిరిగి కంప్యూటర్లు పనిచేస్తాయని సందేశాలు అందాయి. కంప్యూటర్లు లాక్ చేసి డబ్బు డిమాండ్ చేయడం సైబర్ అధికారులు షాక్ తిన్నారు. ఇంత పెద్ద సైబర్ అటాక్ ఎలా జరిగింది..? ఉగ్రవాదులు చేసివుంటారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు పడ్డాయని తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో వంద దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు ఒక్కసారిగా పడిపోయాడు. ది ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్‌గా నిపుణులు చెప్తున్నారు. దీంతో ఎయిర్ లైన్స్‌తోపాటు ఇతర సంస్థలు కూడా సైబర్ ఎటాక్ బారినపడ్డాయని సమాచారం. కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే... కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతుందని సమాచారం. దానిని తిరిగి ఓపెన్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 
 
హ్యాకర్ల ధాటికి లండన్‌లో వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది. సరికొత్త మాల్ వేర్‌తో దాడులు చేసిన హ్యాకర్లు...ఈ కంప్యూటర్లను తిరిగి ఓపెన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వ, ప్రైవేట్ అని సంబంధం లేకుండా అన్ని రంగాలపైనా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 75వేల కంప్యూటర్లలోకి మాల్‌వేర్ ప్రవేశించినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన ఈ సైబర్ దాడిలో ఏపీలో పోలీస్ శాఖకు సంబంధించిన కంప్యూటర్లు హ్యాక్‌కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. పర్సనల్ కంప్యూటర్లను వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. 
 
ఈ సమస్య తొలగిపోయే వరకూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయకూడదని హెచ్చరిస్తోంది. మొబైల్ వినియోగదారులు కూడా ఇంటర్నెట్‌లో వచ్చే స్పామ్ మెసేజ్‌లకు స్పందించకూడదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments