Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 ఫిబ్రవరిలోపు భారత్‌లోకి పబ్ జీ.. కానీ ఆ ఫేక్ డౌన్‌లోడ్ లింక్స్ క్లిక్ చేస్తే..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:55 IST)
పబ్ జీపై నిషేధం విధించిన తర్వాత.. అరెరె అంటూ కుంగిపోయిన పబ్ జీ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పబ్​జీ సహా 118 చైనీస్ యాప్స్​ను భారత ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్​లో బ్యాన్ చేసింది. భారత సమగ్రతకు, భద్రతకు ఈ యాప్స్ ముప్పుగా ఉన్నాయని, డేటాను చోరీ చేస్తున్నాయని పేర్కొంది. కాగా మళ్లీ గేమ్​ను భారత్​‌లో మళ్లీ లాంచ్ చేసేందుకు పబ్​జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తూనే ఉంది.
 
ఈ క్రమంలో భారత్​లో గేమ్​ను లాంచ్ చేస్తామని పబ్​జీ ఇటీవల ప్రకటించింది. అయితే గేమర్లు మాత్రం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే. 2021 ఫిబ్రవరిలోపే భారత్​లో పబ్​జీ వచ్చే అవకాశం ఉంది. అయితే పబ్​జీ అంటూ కొన్ని సైట్లలో లింక్ కనిపిస్తున్నాయి. ఏపీకే ఫైల్స్​ కు లింక్​ లు ఉంటున్నాయి. అయితే అవన్నీ నకిలీవే.
 
పబ్​జీ అని ఉన్న ఫేక్ లింక్​లకు క్లిక్ చేయడం ప్రమాదకరం. దీనివల్ల మొబైళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని వెబ్​సైట్లలో లభిస్తున్న థర్డ్​ పార్టీ ఏపీకే ఫైల్స్​ను కొందరు డౌన్​లోడ్ చేసుకుంటున్నారు. ఇవి జెన్యూన్ ఫైల్స్ కావు. దీన్ని వల్ల ఫోన్​లోకి మాల్​వేర్ వచ్చి.. తెలియకుండా డేటా చోరీకి గురవుతుంది. కాబట్టి పబ్ జీ డౌన్లోడ్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
 
గేమ్ వచ్చేసిందంటూ పుకార్లు పెరిగిపోతుండడంతో పబ్​జీ కార్పొరేషన్​ స్పందించింది. యూజర్లు ఇంకొంత కాలం వేచిచూడాలని సూచించింది. స్థానిక నిబంధనల ప్రకారం ప్లేయర్లు డేటా సురక్షితంగా, భద్రంగా ఉండేలా గేమ్​ను తీసుకొస్తున్నామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి.. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments