పానాసోనిక్, ఇంటెక్స్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు.. ధర రూ.6వేలు లోపే?

పానాసోనిక్ సంస్థ పీ77 వర్షెన్‌తో స్మార్ట్ ఫోన్‌ విడుదల చేసింది. 16జీబీ రోమ్‌తో రూ. 5,299లకే ఈ ఫోను ఫ్లిఫ్‌కార్టులో లభ్యమవుతుంది. పానాసోనిక్ పీ 77 4జీ వోల్ట్ సపోర్ట్‌తో పనిచేస్తుందని.. గ్రే, వైట్ రంగుల

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (13:38 IST)
పానాసోనిక్ సంస్థ పీ77 వర్షెన్‌తో స్మార్ట్ ఫోన్‌ విడుదల చేసింది. 16జీబీ రోమ్‌తో రూ. 5,299లకే ఈ ఫోను ఫ్లిఫ్‌కార్టులో లభ్యమవుతుంది. పానాసోనిక్ పీ 77 4జీ వోల్ట్ సపోర్ట్‌తో పనిచేస్తుందని.. గ్రే, వైట్ రంగుల్లో లభ్యమవుతుందని పానాసోనిక్ ఇండియా మంగళవారం ప్రకటించింది. 
 
పానాసోనిక్ పీ 77 ఫీచర్స్ సంగతికి వస్తే.. 
డ్యుయెల్ సిమ్ స్మార్ట్ 
ఐదించుల హెచ్డీ డిస్‌ప్లే, 
1జీహెచ్‌జెడ్ క్వాడ్ - కోర్ ప్రోసెసర్ 
1జీబీ రామ్
16జీబీ అంతర్గత మెమరీని కలిగివుంటుంది. దీన్ని 32జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. 
ఈ ఫోను ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 
8 ఎంపీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా, 2,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుంటుంది. 
 
ఇకపోతే.. ఇంటెక్స్ నుంచి కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. స్వదేశీ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీ మంగళవారం అక్వా స్టైల్ 3 పేరిట రూ.4,299లకే స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇందులో ఐదించుల ఎఫ్‌‍డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్ అమేజాన్‌లో అందుబాటులో వుంటుందని సదరు సంస్థ ప్రకటించింది. 
 
ఫీచర్స్.. 
4జీ-వోల్ట్ స్మార్ట్‌ఫోన్, 1జీబీ రామ్
16జీబీ ఇంటర్నెల్ మెమరీని కలిగివుండే ఈ ఫోన్‌ మెమరీని 64 జీబీ వరకు పెంచుకోవచ్చు. 
1.3 జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ ప్రోసెసర్ 
ఆండ్రాయిడ్ నగౌట్ 7.0 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోను 2500 ఎంఎహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. 
ఇంకా 5ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరాలను కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments