Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతే టార్గెట్.. ఒప్పో-17 సిరీస్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:18 IST)
Oppo
ఒప్పో నుంచి ఒప్పో-17 సిరీస్‌లో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్లు భారత్‌‌లో విడుదల అయ్యాయి. సెప్టెంబర్‌ 7 నుంచి ఒప్పో ఎఫ్‌ 17 ప్రొ అమ్మకాలు ప్రారంభం కానుండగా ఎఫ్‌ 17 ఫోన్‌ విక్రయాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో కంపెనీ వెల్లడించలేదు.
 
చైనాకు చెందిన ఈ ప్రముఖ మొబైల్‌ మేకర్‌ ఒప్పో నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లలో.. ఒప్పో ఎఫ్ 17 ప్రో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో వస్తోంది. ఒప్పో ఎఫ్ 17లో సెల్ఫీలు తీయడానికి ముందు భాగంలో ఒకే కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. 
 
యువతను ఆకట్టుకునే రీతిలో ఎఫ్‌17 సిరీస్‌ ఫోన్లు మెటల్‌ ఫినీష్‌ డిజైన్‌తో వస్తున్నాయి. భారత్‌లో ఒప్పో ఎఫ్ 17 ప్రో 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,990గా ఉంది. ఈ ఫోన్‌ మ్యాజిక్‌ బ్లాక్‌, మ్యాజిక్‌ బ్లూ, మెటాలిక్‌ వైట్‌ కలర్లలో విడుదలైంది.
 
ఎఫ్‌17 ఫోన్‌ నేవీ బ్లూ, క్లాసిక్‌ సిల్వర్‌, డైనమిక్‌ ఆరెంజ్‌ రంగుల్లో రిలీజ్‌ కాగా దీని ధర ఇంకా వెల్లడించలేదు. 4జీబీ + 64జీబీ, 4జీబీ + 128జీబీ, 6జీబీ + 128జీబీ, 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఫోన్‌ లభించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments