Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో ఒప్పో ఎఫ్25 ప్రో

సెల్వి
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (19:19 IST)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో తన ఎఫ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ పేరుతో మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. దీని ధరలు 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. లావా రెడ్‌, ఓషన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారతీయ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. 
 
ఈ ఫోన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్‌ ఆధారిత కలర్‌ ఓఎస్‌ 14.0తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ అమర్చారు. ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనకభాగంలో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సోనీ ఐఎంఎక్స్355 వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. 
 
ఫోన్‌లో ఇరువైపులా ఉన్న కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 5జీ, వైఫై 6, బ్లూటూత్‌, జీపీఎస్‌ కనెక్టివిటీ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 10 నిమిషాల్లో 30 శాతం ఛార్జ్‌ అవుతుందని ఒప్పో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments