Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీఫిక్స్ సమస్య తీరిపోయింది: 0 లేదా +91 నొక్కాల్సిన అవసరం లేదు!

Webdunia
బుధవారం, 20 మే 2015 (12:22 IST)
ఇక ప్రీఫిక్స్ సమస్య తీరిపోయింది. దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్ పీ) అమలుకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన 'ప్రీఫిక్స్' అవసరం ఇక లేనట్లే. ఇకపై ఎస్టీడీ కాల్ చెయ్యాలంటే 'సున్నా' లేదా '+91' నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అవతలి వ్యక్తి ఫోన్ నెంబరును డయల్ చేస్తే చాలు. ఇప్పటికే పలు టెలికం సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.  
 
ఇండియాలో అత్యధికంగా మొబైల్ ఫోన్ కనెక్షన్లు అనుభవిస్తున్న ఎయిర్ టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్ తదితర సెల్ ఫోన్ ఆపరేటింగ్ సంస్థలు '0', '+91' కలపకున్నా కూడా కనెక్షన్లను కలిపే సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ఒకటి రెండు కంపెనీలు ఈ సాంకేతికతకు అప్ గ్రేడ్ కాలేదని సమాచారం. 
 
ఈ కంపెనీలు జూన్ నెలాఖరులోగా 'ప్రీఫిక్స్' లేకుండా కనెక్టింగ్ సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందించాల్సి వుంది. కాగా జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంఎన్ పీ అమలు కానున్న సంగతి తెలిసిందే. ఈ సదుపాయం అమలైతే ఏ సర్కిల్ లోని ఏ టెలికం ఆపరేటర్ సేవలందుకుంటున్న వారైనా, మరో సర్కిల్, ఆపరేటర్ కు అదే నెంబరును మార్చుకోవచ్చు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments