ఫోన్ 2ను విడుదల చేసిన నథింగ్

Webdunia
బుధవారం, 12 జులై 2023 (23:04 IST)
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ రెండవతరం ప్రధాన స్మార్ట్‌ఫోన్ తమ ఫోన్ 2ను విడుదల చేసినట్లు నథింగ్ ఈ రోజు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత శ్రద్ధగా ఉండేలా చేస్తూ ఈ ఫోన్ 2 రూపొందించారు, ఫోన్ 2 వెనుక భాగంలో కొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేశారు. వినియోగదారులకు కీలక సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే అవకాశం అందించటం ద్వారా స్క్రీన్ ను ఎక్కువగా చూడటం తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఇది పునరుద్దరించబడిన నథింగ్ OS 2.0ని కూడా కలిగి ఉంది.
 
ఇది వినియోగం మెరుగుపరిచే రీతిలో మలచబడటంతో పాటుగా అవాంతరాలను తగ్గించడానికి రూపొందించబడింది. అదే సమయంలో నథింగ్ యొక్క ప్రత్యేకమైన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూనే వేగవంతమైన, మృదువైన అనుభవాన్ని అందిస్తుంది. టాప్-ఆఫ్-ది-లైన్ Snapdragon 8+ Gen 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఆధారితమైన ఫోన్ (2) ఇప్పటివరకు, నథింగ్ యొక్క అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో జీవితపు తరహా  ఫోటోగ్రఫీ కోసం అధునాతన అల్గారిథమ్‌లతో శక్తివంతమైన 50MP డ్యూయల్ వెనుక కెమెరా ఉంది. LTPOతో అద్భుతమైన 6.7-అంగుళాల OLED డిస్ప్లే సైతం దీనిలో వుంది. 
 
"ఫోన్ (2)తో, మేము హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ డిజైన్ ఆవిష్కరణల ద్వారా మరింత ఉద్దేశపూర్వక స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అత్యున్నత శ్రేణి ఫీచర్లను అందజేస్తాము" అని నథింగ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ అన్నారు. "స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితాల్లో ఒక ముఖ్యమైన సాధనం, కానీ అది మన ఉనికిని తక్కువ చేస్తూ, సృజనరహితంగా చేసే ఒక కలవరపరిచే శక్తిగా మారింది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments