Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ రిక్రూట్లను ఇంటికి పంపిస్తారా? బాస్‌లు జీతాలు కట్ చేసుకోండి.. అంటూ గద్దించిన ఎన్ఆర్ నారాయణ మూర్తి

ఐటీ సెక్టర్‌లో లేఆఫ్‌లు అంతర్జాతీయ పతాక శీర్షికలు అవుతున్న నేపథ్యంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ఉద్యోగాలను కాపాడాలంటే కంపెనీల యజమానులు, బాస్‌లు అత్యధిక రేటులో ఉన్న తమ జీతాలను కట్ చేసుకోవాలని నారాయణ మూర్తి సూచించారు. సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో ఉన్నవ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (08:51 IST)
భారతీయ ఐటీ పరిశ్రమ గతంలో కూడా చాలాసార్లు పెను సంక్షోభాలకు గురైనప్పటికీ మళ్లీ నిలదొక్కుకుందని, ప్రస్తుతం నిరాశాపూరితమైన అంచనాలు అనవసరమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. గతంలోనూ ఐటీ పరిశ్రమ ఖాయిలా పరిస్థితులను ఎదుర్కొందని, నూతన అవకాశాలను ఐటీ పరిశ్రమ గుర్తించడమే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారమని మూర్తి చెప్పారు. 
 
ఐటీ సెక్టర్‌లో లేఆఫ్‌లు అంతర్జాతీయ పతాక శీర్షికలు అవుతున్న నేపథ్యంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ఉద్యోగాలను కాపాడాలంటే కంపెనీల యజమానులు, బాస్‌లు అత్యధిక రేటులో ఉన్న తమ జీతాలను కట్ చేసుకోవాలని నారాయణ మూర్తి సూచించారు.  సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో ఉన్నవారు తమ వేతనాలను కాస్త కుదించుకోవడం వంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోగలిగనట్లయితే కొత్తగా వచ్చి  చేరిన యంగ్‌స్టర్స్ ఉద్యోగాలను కాపాడే అవకాశముందని చెప్పారు.
 
దీనికి సంబంధించి ఇన్ఫోసిస్‌నే ఉదాహరణగా మీకు చెబుతాను. 2001 సంవత్సరంలో ఐటీ మార్కెట్ భయంకర పరిస్థితికి గురై కుప్పగూలినప్పుడు సంస్థలోన సీనియర్ మేనేజ్మెంట్ మొత్తంగా కూర్చుని చర్చించాము. మనం కొంత త్యాగానికి సిద్ధపడి యువతీయువకుల ఉద్యోగాలను కాపాడదాం అని మేం నిర్ణయించుకున్నాం అని మూర్తి గుర్తు చేసుకున్నారు.
 
ఇటీవలి కాలంలో భారత దేశంలోని రెండో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి దారైన ఇన్పోసిస్ సంస్థలో మూర్తి, ఇతర వ్యవస్థాపకులు ఇన్పోసిస్ డైరెక్టర్ల బోర్డుతో ఘర్షణపడ్డారు. టాప్ బాస్‌లకు 60-70 శాతం వేతన పెంపును కల్పిస్తూ ఇతరులకు అతి తక్కువ ప్యాకేజీలను అందించడం సంస్థలో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు అన్యాయం చేసినట్లే అవుతుంది మూర్తి తదితరులు వాదించారు. 
 
భారతదేశ అతి ప్రధాన పరిశ్రమల్లో ఐటి అవుట్ సోర్స్ ఒకటి. కానీ నూతన టెక్నాలజీలతో అప్‌డేట్ కాకపోవడం వల్ల జరుగుతున్న అటోమేషన్ వల్ల, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ఎస్ 1బి వీసాలపై ఆంక్షలు విధించడం వల్ల రాబోయే నాలుగు సంవత్సరాల్లో దేశంలో వేలాది ఉద్యోగాలు మాయం కానున్నాయి. ఇప్పటికే దేశంలోని అతి పెద్ద ఐటీ సంస్థలు వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించడం మొదలు పెట్టేశాయి. 
 
ఐటీ అవుట్ సోర్స్ పరిశ్రమలు దాదాపు 40 లక్షలమంది భారతీయులకు ఉద్యోగాలు కల్పించాయి. వీరిద్వారా 150 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయని నాస్కామ్ తెలిపింది. 
ఐటీ పరిశ్రమ గతంలో కూడా చాలా పెద్ద వెనుకంజలకు గురైందని కానీ నిరాశాజనకమైన అంచనాలు వేసుకోవద్దని మూర్తి చెప్పారు. గతంలో చాలా సార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. 2001లో 2008లో పెద్ద సంక్షోభాలు ఎదురయ్యాయి. కాబట్టి ప్రస్తుత సంక్షోభంలో కొత్త విషయమేమీ లేదు. ఈ సంక్షోభాన్ని చూసి తీవ్రంగా కలవరపడాల్సిన అవసరం లేదు. గతంలో ఇలాంటి సమస్యలకు మనం పరిష్కారం కనుగొన్నాం అని మూర్తి చెప్పారు.
 
కంపెనీల అధినేతలు నూతన అవకాశాలను వెతికి, కొత్త రిక్రూట్లకు శిక్షణ ఇచ్చి వచ్చే సంవత్సరం కంపెనీకి ప్రయోజనం కలిగేలా పని చేయాలని చెప్పాలి. వారు విఫలమైతే అప్పడు వారిని వేరొక జాబ్ వెతుక్కోవాలని చెబితే సరిపోతుంది. అంతే తప్ప ఉన్నఫళాన వారిని ఇంటికి వెళ్లమని చెప్పి వారిలో భయాందోళనలు రేపవద్దు. ఎందుకంటే వారిపై వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి సూచించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments