Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టే ఫీచర్స్‌తో నోకియా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:17 IST)
Nokia
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోన్న నోకియా సంస్థ అదరగొట్టే ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో నోకియా ఎక్స్ 20, నోకియా ఎక్స్ 10 సిరీస్‌లో ఏకంగా ఆరు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 
 
5జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను జోడించిన ఈ ఫోన్‌లు వచ్చే నెలలో భారత్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో మొత్తం ఒక్కో సిరీస్‌లో మూడు రకాల ఫోన్‌ల చొప్పున నోకియా తీసుకొచ్చింది.
 
నోకియా ఎక్స్ 20 సిరీస్‌లో 8/128, 6/128 జీబీ, నోకియా ఎక్స్ 10లో 6/128 జీబీ, 6/64 జీబీ, 4/128 జీబీ వేరియంట్‌లలో ఫోన్‌లు ఉన్నాయి. ర్యామ్‌, స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా వాటి ధరలను నిర్ణయించారు. 
 
అన్ని ఫోన్‌లకు 6.6 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11, 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌, 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, 64+5+2+2 మెగా క్వాడ్ కెమెరా, 4,470 ఎంహచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments