Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత : ఈ యేడాది ఇది మూడో విడత లేఆఫ్స్

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (09:59 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోమారు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగింపునకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ యేడాది ఇప్పటికే మూడుసార్లు లేఆఫ్స్‌ను ప్రకటించిన ఈ టెక్ దిగ్గజం ఇపుడు మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. జూలై నెల ఆరంభంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రటన వెలువడవచ్చని ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ దఫా లేఆఫ్‌లు ప్రభావం ముఖ్యంగా సంస్థ విక్రయాల విభాగంలో అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. 
 
సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా, అలాగే కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరం జులైలోనే ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
 
కాగా, ఈ యేడాది మే నెలలో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది వారాల వ్యవధిలోనే మరో 300 మందికి పైగా సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. గతంలో జరిగిన లేఆఫ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇప్పుడు జరగబోయే కోతల్లో సేల్స్ బృందాలే ప్రధాన లక్ష్యంగా ఉండొచ్చని సమాచారం.
 
కాగా, గత యేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,28,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 45,000 మంది సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారే. అంతకుముందు 2023 జనవరిలో కూడా కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments