Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ బ్రౌజర్‌కు టాటా చెపుతున్న మైక్రోసాఫ్ట్

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:02 IST)
టెక్ దిగ్గజం పాతికేళ్ళ క్రితం ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ పేరుతో ఓ బ్రౌజ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇపుడు దీనికి రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నట్టు తెలిపింది. దాదాపు పాతికేళ్ళ క్రితం ఈ బ్రౌజ‌ర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజ‌ర్లు అంతా గూగుల్ క్రోమ్‌, యాపిల్ స‌ఫారీకి అల‌వాటు ప‌డ‌టంతో.. ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు మార్కెట్ త‌గ్గింది. 
 
ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోర‌ర్‌కు బ‌దులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్ ఉంటుంద‌ని ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుంద‌ని, భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు కూడా ఎక్కువ‌ని, ఐఈతో పోలిస్తే అత్యాధునిక బ్రౌజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉంటుంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 
 
ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది యూజ‌ర్లు కామెంట్ల‌తో ముంచెత్తారు. రిప్ సందేశాల‌ను పోస్టు చేశారు. జూన్ 15, 2022 నుంచి ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ బ్రౌజ‌ర్ రిటైర్ అవుతుంద‌ని మైక్రోసాఫ్ట్ స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత కంపెనీ నుంచి ఆ బ్రౌజ‌ర్‌కు ఎటువంటి స‌పోర్ట్ ఉండ‌ద‌న్న‌ది. 
 
కానీ ఎక్స్‌ప్లోర‌ర్ ఆధారంగా ప‌నిచేస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేష‌న్లు మాత్రం.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్‌తో 2029 వ‌ర‌కు ప‌నిచేయ‌నున్నాయి. ప్ర‌స్తుత మార్కెట్‌లో గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజ‌ర్‌ను 65 శాతం వినియోగిస్తున్నారు. ఇక మార్కెట్ షేర్‌లో 19 శాతం యాపిల్‌ కంపెనీకి చెందిన స‌ఫారీ బ్రౌజ‌ర్ ఉన్న‌ది. 3.59 శాతంతో ఫైర్‌ఫాక్స్‌, 3.39 శాతంతో ఎడ్జ్ బ్రౌజ‌ర్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments