Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ పండ్లు ఆర్డర్ చేస్తే 'ఆపిల్ ఎస్ఈ (iphone SE) వచ్చిందోచ్..!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (13:51 IST)
Apple iPhone SE
ఆన్‌లైన్ ఆర్డర్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుల కంటే వేరొక వస్తువులు వస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ ఆపిల్ ఫోన్ ఆర్డరిస్తే ఆపిల్ జ్యూస్ వచ్చిన వార్త వినే ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓ వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే అతని పుణ్యం పుచ్చిందేమో గానీ ఏకంగా 'ఆపిల్ ఎస్ఈ (iphone SE) వచ్చింది. దీంతో అతను ఎగిరి గంతేశాడు. పండగ చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన నిక్ జేమ్స్ అనే 50 ఏళ్ల వ్యక్తి స్థానిక సూపర్ టెస్కో ఎక్ట్ర్సా నుంచి నిక్ జేమ్స్ 50ఏళ్ల వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డరిచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన సమయానికే డెలివరీ కూడా వచ్చింది. ''ఆర్డర్ వచ్చింది తీసుకోవటానికి రండి జేమ్స్'' అంటూ ఫోన్ రావడంతో బుధవారం (ఏప్రిల్ 14,2021) నాడు ఆయన టెస్కోకు వెళ్లాడు. అక్కడి వెళ్లగానే.. సిబ్బంది నిక్ ముందు ఓ బ్యాగ్ పెడుతూ 'మీకో సర్‌ప్రైజ్ ఉంది సార్' అని చెప్పారు. దానికి జేమ్స్ ఏమాత్రం హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే హా.. ఏముంటుందిలే ఏదో చిన్న గిఫ్ట్ అయి ఉంటుందని లైట్ తీసుకున్నాడు.
 
అలా పెద్ద ఆసక్తి లేకుండానే ప్యాకెట్ విప్పి చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాంట్లో ఉన్న గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టాడు. జాక్ పాట్ కొట్టేసానోచ్ అంటూ ఎగిరి గంతేశాడు. కారణం.. నిక్ ఆపిల్ పళ్లు ఆర్డర్ చేస్తే ఏకంగా 'ఆపిల్ SE (iphone SE) వచ్చింది. ఎందుకంటే..టెస్కో కంపెనీ తన వినియోగదారుల కోసం ఇటీవల ఓ ప్రోత్సాహకర ఆఫర్ ప్రకటించింది. 
 
ఆపిల్, శాంసంగ్ వంటి ఖరీదైన గాడ్జెట్స్‌ను తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎప్రిల్ 18 వరకూ కొనసాగనుందని ప్రకటించింది. ఈ క్రమంలో నిక్ జేమ్స్ అదృష్టం పండి.. ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే ఐఫోన్ వచ్చి చేతిలో పడింది. జేమ్స్ తన ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాను ఆర్డర్ చేస్తే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చిందని ఇది తనకు ఎంతో ఎంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనంటూ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments