Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌‌ను వేడి నీటితో సబ్బేసి వాష్ చేయొచ్చు.. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో?

స్మార్ట్ ఫోన్‌ నీటిలో పడిందో అంతే సంగతులు. అయితే క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌ను మాత్రం సబ్బుతో కాదు వేడి నీటితో కూడా వాష్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో అందుబాటులోకి

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:37 IST)
స్మార్ట్ ఫోన్‌ నీటిలో పడిందో అంతే సంగతులు. అయితే క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 స్మార్ట్ ఫోన్‌ను మాత్రం సబ్బుతో కాదు వేడి నీటితో కూడా వాష్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.25,660గా ఉంది.

ఇక ఈ ‘రాఫ్రె కేవైవీ 40’ ఫీచర్స్ సంగతికి వస్తే.. 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లేను కలిగి వుంటుంది.
వేడి నీటితో సబ్బుతో కడిగే ఈ ఫీచర్‌ను కలిగివున్న ‌ప్రపంచంలోనే తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనని క్యోసెరా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో దీనిని రూపొందించడం జరిగిందని సంస్థ అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే ఎల్ ఈడీ ప్లాష్‌తో 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా మొదలైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేశారు.

అంతేగాకుండా... 1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, అడ్రినో 505 గ్రాఫిక్ప్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1.4 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను ఇది కలిగివుంటుందని సంస్థ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments