జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ

జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (18:55 IST)
జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా క్యూలో వున్నారు. 
 
జియో ఇస్తున్న పోటీకి ఎయిర్ టెల్, వొడాఫోన్ దిమ్మతిరిగిపోతున్నాయి. పోటీని తట్టుకోవడం అటుంచి వున్న కస్టమర్లనే కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇది జియో తరహాలోనే వుంది. 
 
రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందిస్తామని ప్రకటించింది. అలాగే రూ.149 ప్లాన్‌ను 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే స‌దుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఆఫర్‌కు ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments