జియో నుంచి లైవ్ వీడియో కాల్ ఫీచర్.. '102 నాటౌట్' కామెడీ షోని?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత జియో ఇంటరాక్ట్ వేదికను ప్రారంభించింది. జియో ఇంటరాక్ట్‌లో భాగంగా తొలుత లైవ్ వీడియో

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:59 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత జియో ఇంటరాక్ట్ వేదికను ప్రారంభించింది. జియో ఇంటరాక్ట్‌లో భాగంగా తొలుత లైవ్ వీడియో కాల్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటన చేసింది. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా మై జియో అప్లికేషన్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
 
యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్ చేసి స్టార్ వీడియో కాల్‌పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ త్వరలో ప్రారంభించబోయే ''102 నాటౌట్'' కామెడీ షోని ఈ లైవ్ వీడియో కాల్ ఫీచర్ ద్వారా అందించనున్నట్లు జియో వెల్లడించింది. 
 
ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, 150 మిలియన్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో టెలికాం రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న జియో.. తాజా సేవలతో కస్టమర్ల సంఖ్యను పెంచుకునే వీలుంటుంది. త్వరలో వీడియో కాల్ సెంటర్లు, వీడియో కేటలాగ్, వర్చువల్ షో రూమ్‌లు ప్రవేశ పెట్టనున్నట్టు జియో తెలిపింది. జియో ఇంటరాక్ట్‌లో తొలి లైవ్ వీడియో కాలింగ్ అమితాబ్ బచ్చన్‌తోనే ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments