రిలయన్స్ జియోకు ప్రత్యర్థి విసిరిన పంజా దెబ్బతో ఇబ్బందులు తప్పేలాలేవు. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అంద
రిలయన్స్ జియోకు ప్రత్యర్థి విసిరిన పంజా దెబ్బతో ఇబ్బందులు తప్పేలాలేవు. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది.
ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ వెల్లడించింది. టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్‌ను పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్‌గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్‌ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు.