Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటెల్ నుంచి కొత్త ఫీచర్.. ధర: రూ.1.049.. టెంపరేచర్‌ను అలా గుర్తించేలా..?

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (11:23 IST)
Itel
ఐటెల్ సంస్థ కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ప్రధానంగా కరోనా సంక్షోభ  సమయంలో బాడీ టెంపరేచర్‌ను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన తాము ఈ ఫోన్‌ను  తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో ఐటెల్‌ దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను కేవలం. రూ .1,049గా నిర్ణయించింది.  
 
ఇన్‌బిల్ట్‌ టెంపరేచర్‌ సెన్సర్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్‌ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఫారెన్‌హీట్‌గా కూడా మార్చవచ్చు. అంతేకాదు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్‌  ద్వారా ఇన్‌కమింగ్ కాల్‌లు, సందేశాలు, మెనూ వివరాలు మాత్రమే కాకుండా బాడీ టెంపరేచర్‌ వివరాలను కూడా వినిపిస్తుంది. 
 
కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేసేలా ఎంట్రీ లెవల్‌ దేశంలోనే తొలి ఫీచర్‌ ఫోన్‌గా ఇది నిలిచింది. అలాగే టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్‌ ఇందులోని మరో విశేషం.   
 
యూజర్లు టెంపరేచర్‌ను గుర్తించేలా ఫోన్‌లో థర్మో సెన్సార్‌ను పొందుపర్చింది. థర్మో బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచితే టెంపరేచర్‌ను రీడ్‌ చేస్తుంది. సెన్సార్‌ను అరచేతిలో ఉంచుకోవడం లేదా సెన్సార్‌పై టచ్ ఫింగర్‌ను ఉంచితే సెల్సియస్‌లో టెంపరేచర్‌ను చూపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

తర్వాతి కథనం
Show comments