Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోలో ఇంటెల్ పెట్టుబడి.. క్లౌడ్ కంప్యూటింగ్, 5జీలపై దృష్టి

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (09:45 IST)
రిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి పెట్టింది.. ఇంటెల్ సంస్థ. వరుస పెట్టుబడులతో రికార్డు  క్రియేట్‌ చేస్తున్న ముకేశ్‌  అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో ఫ్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం ఈక్విటీ వాటా ఇంటెల్ క్యాపిటల్‌కు దక్కనుంది. తద్వారా జియో  ప్లాట్‌ఫామ్‌లలో ఇంటెల్ క్యాపిటల్ 1,894.50 కోట్లు  రూపాయల పెట్టుబడి పెట్టినట్లైంది. 
 
గత 11 వారాల్లో  12 దిగ్గజ సంస్థలనుంచి భారీపెట్టుబడులను  జియో సొంతం చేసుకుంది. ఈ మొత్తం పెట్టుబడి విలువ 117,588.45 కోట్లకు చేరింది. తాజాగా ఇంటెల్ పెట్టుబడిపై ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దేశాన్ని  ముందుకు నడిపించేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments