Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్రైజల్‌పై 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి అసంతృప్తి... ఉద్యోగులకున్న నమ్మకం ఏమవుతుంది?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో అమలు చేస్తున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న అప్రైజల్ విధానం వల్ల ఇన్ఫోసిస్ బోర్

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (15:17 IST)
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో అమలు చేస్తున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న అప్రైజల్ విధానం వల్ల ఇన్ఫోసిస్ బోర్డుపై ఉద్యోగులకున్న నమ్మకం పోతుందని ఆయన వాపోయారు. కొత్త ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫోసిస్‌లో వేతనాల పెంపు కార్యక్రమం అప్రైజల్ పూర్తిచేశారు. ఇందులో ఉన్నతోద్యోగులకు 60 నుంచి 70 శాతం మేరకు వేతనాలను, మిగతావారిలో అత్యధికులకు 6 నుంచి 8 శాతం మాత్రమే జీతాలు పెంచారు. 
 
దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందిస్తూ అప్రైజల్ కోసం పాటించిన విధానం అనైతికమని చురకలంటిస్తూ బోర్డుకు లేఖ రాశారు. ఇలాంటి చర్యల వల్ల బోర్డుపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం పోతుందన్నారు. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాకు ఇస్తున్న ప్యాకేజీ పెంచిన విషయంలో కూడా బోర్డు డైరెక్టర్ల నిర్ణయంపై తనకు అసంతృప్తిగానే ఉందని నారాయణమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
 
కాగా, సంస్థలో పని చేసే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు సాలీనా రూ.4.62 కోట్ల వేతనం, ఆపై రూ.3.88 కోట్ల పరిహారం ఇవ్వాలని డైరెక్టర్లు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం 24 శాతం మంది ప్రమోటర్లు మాత్రమే ప్రవీణ్ రావు వేతన పెంపుపై అనుకూలంగా ఉన్నారని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments