Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ పే.. 2 కోట్ల మందికే.. అదీ మనదేశ ఫోన్ నెంబర్లకే...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (09:49 IST)
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ పేరిట ఆన్ లైన్ చెల్లింపుల రంగంలో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ వాట్సాప్‌కు తాజాగా అనుమతులు మంజూరు చేసింది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు మొదట తమ బ్యాంక్ ఖాతాతో లింకైన ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ అవ్వాలి.
 
బ్యాంక్ అకౌంట్‌తో లింకైన నెంబరు, వాట్సాప్ నెంబరు ఒకటే అయ్యుండాలి. వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రత్యేకంగా పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. దానిపై క్లిక్ చేస్తే బ్యాంకుల జాబితా దర్శనమిస్తుంది. నగదు పంపాల్సిన బ్యాంకును ఎంపిక చేసుకోగానే ఎస్సెమ్మెస్‌తో అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపై యూపీఐ పాస్ కోడ్ సెట్ చేసుకోవాలి.
 
ఇదివరకే యూపీఐ పాస్ కోడ్ ఉపయోగిస్తుంటే ఆ పాస్ కోడ్ వాట్సాప్ పేమెంట్స్‌కు కూడా సరిపోతుంది. ఇతర యూపీఐ ఆధారిత యాప్‌ల తరహాలోనే దీనికి వ్యాలెట్‌లో నగదు నిల్వ చేసుకోవాల్సిన పనిలేదు. యూపీఐ సాయంతో నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేయొచ్చు. దీంట్లో మరో సదుపాయం కూడా ఉంది.
 
వాట్సాప్ పేమెంట్స్ నుంచి ఇతర పేమెంట్స్ యాప్‌లకు కూడా నగదు బదిలీ చేయొచ్చు. అవతలి వ్యక్తి వాట్సాప్ పేమెంట్స్‌లో రిజిస్టర్ కాకపోయినా వారి భీమ్, ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ ఐడీ సాయంతో లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ఐడీ లేకపోతే, వాట్సాప్ పేమెంట్స్‌లో రిజిస్టరై పాస్ కోడ్ పొందవచ్చు. వాట్సాప్ పేమెంట్స్‌లో నగదు బదిలీ పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు.
 
ఇతర పేమెంట్ యాప్‌ల్లో ఇదే తరహాలో నగదు పరిమితి ఉంది. వాట్సాప్ పేమెంట్స్‌లో లావాదేవీలకు ఎలాంటి రుసుము అక్కర్లేదు. కాగా, భారత బ్యాంకుల్లో ఖాతాలు ఉండి, మనదేశ ఫోన్ నెంబర్లు వినియోగిస్తున్న వారికే ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 
 
అంతర్జాతీయ ఫోన్ నెంబర్లతో వాట్సాప్ ఉపయోగిస్తున్నవారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ప్రస్తుతానికి రెండు కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ సేవలు అందించాలని భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ వాట్సాప్‌ను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments