అదిరిపోయే ఫీచర్లతో హానర్ 8సి స్మార్ట్ ఫోన్

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (10:43 IST)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయ్ అనుబంధ కంపెనీ అయిన హానర్ తాజాగా ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. హానర్ 8సీ పేరుతో విడుదల చేసిన ఫోన్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈనెల 10వ తేదీ నుంచి ప్రత్యేకంగా అమ్మకానికి ఉంచనున్నారు. ఈ ఫోనులో తొలిసారి క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్‌ టెక్నాలజీని ఉపయోగించడం గమనార్హం.
 
అలాగే, 6.26 అంగుళాల స్క్రీన్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, కాట్స్ ఐ డిజైన్‌తో వస్తున్న ఈ పోన్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. 4జీబీ ర్యామ్ 32 జీబీ మెమరీ స్టోరేజీ‌ వేరియంట్‌తో తయారు చేసిన ఈ ఫోన్ ధర రూ.11,999 కాగా, 4జీబీ ర్యామ్ 64 జీబీ మెమరీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. 
 
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ వి8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 13, 2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments