రిలయన్స్ జియోకు శుభవార్త... కస్టమర్లకు చేదువార్త... 'ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ' టోన్‌తో బేజారు

నిజంగా ఇది రిలయన్స్ జియోకు శుభవార్త అయినప్పటికీ.. జియో సిమ్ కార్డు వాడే వినియోగదారులకు మాత్రం ఇది నిజంగానే చేదువార్తే. జియో సిమ్ వాడే మొబైల్ కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదేసమయంలో జియో ఇంటర్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (10:29 IST)
నిజంగా ఇది రిలయన్స్ జియోకు శుభవార్త అయినప్పటికీ.. జియో సిమ్ కార్డు వాడే వినియోగదారులకు మాత్రం ఇది నిజంగానే చేదువార్తే. జియో సిమ్ వాడే మొబైల్ కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదేసమయంలో జియో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా స్వయంగా నిర్ధారించింది. 
 
దేశవ్యాప్తంగా గత నెల నుంచి రిలయన్స్ జియో టెలికాం సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉచిత వాయిస్ కాల్స్, అతి తక్కువ ధరకు డేటాను ఇస్తామంటూ ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ చేసిన సంచలన ప్రకటనతో దేశ టెలికాం రంగం ఓ కుదుపుకు లోనైంది. కానీ, రిలయన్స్ జియో మాత్రం తన లక్ష్యానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. 
 
జియో అందుబాటులోకి వచ్చిన తర్వాత 1.6 కోట్ల మంది సిమ్‌లను తీసుకోగా, మొత్తం కస్టమర్ల బేస్ 2.4 కోట్లకు చేరుకుంది. ఇది సంస్థకు శుభవార్తే. మూడు నెలల ఉచిత ఇంటర్నెట్, ఉచిత కాల్స్ ఆఫర్ కారణంగానే అత్యధికులు ఈ సిమ్‌లను తీసుకున్నారు. ఇక సిమ్‌లను తీసుకున్న వారిలో ఎంతో మంది తాము కాల్స్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్క రిలయన్స్ నెట్‌వర్క్ మినహా ఇతర నెట్‌వర్క్‌లకు ఎపుడు ఫోన్ చేసినా 'ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ' టోన్ వినిపిస్తోంది. 
 
అదేసమయంలో యూజర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జియో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. ట్రాయ్ స్వయంగా జియో వేగాన్ని లెక్కించి, జియో స్థానం టాప్-5లో ఆఖరిదని తేల్చింది. సిమ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్న ఎంతో మంది యూజర్లు ఇప్పుడు దాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క కాల్ చేసుకోవడానికి పదుల కొద్దీ డయల్ చేస్తూనే ఉండాల్సి వస్తోంది. 
 
ఇది యూజర్లకు విసుగు పుట్టిస్తోంది. దీనిపైనే అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని రిలయన్స్ జియో అధికారులు ప్రకటించినా, ఇంతవరకూ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. దీంతో మున్ముందు రిలయన్స్ జియో సేవలు ఏ విధంగా ఉంటాయోనన్న ఆందోళనలో పడిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adivi Sesh: తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా డెకాయిట్ : అడివి శేష్

Faria Abdullah: హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలనేం లేదు : ఫరియా అబ్దుల్లా

Janardana Maharshi: పరిమళాదేవి, శుభలక్ష్మీ, సంస్కృత , సహస్త్ర పుస్తకాల రచయిత జనార్దనమహర్షి

Johnny Master: యూనియన్‌లో సమస్యలుంటే మనమే పరిష్కరించుకుందాం : శ్రీశైలం యాదవ్

నిధి అగర్వాల్‌ను ఉక్కిరిబిక్కిరిన చేసిన ఫ్యాన్స్, తృటిలో ఎస్కేప్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments