జూలై ఒకటో తేదీ అమల్లోకి జీఎస్టీ: అప్పుడే తగ్గిన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి

జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. జీఎస్టీకి దేశంలోని పలు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌నే జీఎస్టీ అంటారు. జీఎస్టీ టాక్స్ వినియోగదారులకు చేరుతుంది. జీఎస్టీకి కనీస ఆ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (13:25 IST)
జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. జీఎస్టీకి దేశంలోని పలు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌నే జీఎస్టీ అంటారు. జీఎస్టీ టాక్స్ వినియోగదారులకు చేరుతుంది. జీఎస్టీకి కనీస ఆదాయం రూ.10లక్షలు. ఇంకా రూ.20లక్షలకు పైబడిన ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారులు తప్పకుండా జీఎస్టీ కట్టాల్సిందే. జీఎస్టీ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల శాతం అధికం అవుతుందని అంచనా. ధరలు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. జీఎస్టీ ద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. 

ఈ నేపథ్యంలో జీఎస్‌టీ ప్రభావం అప్పుడే మొదలైంది. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల వెల్లువను నిలువరించేందుకు మొబైల్ మేకర్లు అప్పుడే ఉత్పత్తిని తగ్గించేశారు. ఈ నెలలో ఫోన్ల ఉత్పత్తిని 10-15 శాతం తగ్గించినట్టు సమాచారం. నోకియా, పానసోనిక్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు ఇప్పటికే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశాయి. చిరు వ్యాపారులు, వ్యాట్ పరిధిలోకి రాని వ్యాపారులు జీఎస్‌టీలోకి వచ్చేందుకు అంతంగా ఆసక్తి చూపడం లేదు.
 
రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మధ్యతరహా కంపెనీల్లో జీఎస్‌టీ భయం ఎక్కువగా ఉందని డిక్సన్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సునీల్ వచ్చాని పేర్కొన్నారు. ఇంటెక్స్, పానసోనిక్, జియోనీ ఫోన్లను తయారు చేసే ఈ కంపెనీ.. జీఎస్టీతో ఉత్పత్తి 15శాతం వరకు తగ్గిపోయిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments