గూగుల్ పే యూజర్లకు షాక్.. ఉచితంగా ఇక పేమెంట్స్ వుండవ్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (13:03 IST)
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ప్రస్తుతం అధికమైపోతున్నాయి. ఇలాంటి యాప్స్‌లలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ కలిగిన యాప్ ఏదైనా ఉంది అంటే అందరు టక్కున చెప్పే పేరు గూగుల్ పే. ప్రస్తుతం ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉన్న గూగుల్ పే ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తుంది. 
 
కాగా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్ పే వినియోగదారులందరికీ ఝలక్ ఇచ్చింది. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తే మాత్రం తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఎవరికైనా గూగుల్‌పై నుంచి డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి చార్జీలు లేకుండానే డబ్బులు పంపడం సాధ్యం అయ్యేది.
 
కానీ ఇకపై ఇలాంటివి అస్సలు కుదరదు. ఇక ప్రస్తుతం ఉచితంగా పేమెంట్స్ చేసుకునే ఫెసిలిటీ నిలిపివేసేందుకు గూగుల్ పే ఫ్లాట్ ఫామ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 జనవరి నుంచి ఈ సరికొత్త నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటినుంచి గూగుల్ పే ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ పే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
 
ఈ సరికొత్త పేమెంట్ సిస్టం ద్వారా గూగుల్ పే నుంచి ఎవరైనా యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సరికొత్త పేమెంట్ ఆప్షన్ పై ఏ మొత్తంలో చార్జీలు విధించబోతున్నారు అనేదానిపై మాత్రం గూగుల్ పే స్పష్టత ఇవ్వలేదు. 
 
ఇక ప్రస్తుతం గూగుల్ పే మొబైల్ యాప్ ద్వారా డబ్బులు పంపించడం స్వీకరించడం ఇలాంటి సేవలను అందిస్తోంది గూగుల్ పే. ప్రస్తుతం గూగుల్ తీసుకున్న కొత్త నిర్ణయం మాత్రం కేవలం వెబ్ యాప్‌కి మాత్రమే వర్తిస్తుంది అన్నది అర్ధమవుతుంది. దీంతో గూగుల్ పే వినియోగదారులకు భారీ షాక్ తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments