Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? ఆ ఫీచర్ వచ్చేస్తోంది..

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు రిమైండర్స్ యాడ్స్ వస్తుంటాయి. ఇకపై ఈ యాడ్స్‌ను మ్యూట్ చేసే సదుపాయాన్ని సెర్చింజన్ గూగుల్ కల్పించింది. త్వరలో ''మ్యూట్ దిస్ యాడ్'' పేరుతో

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (19:04 IST)
గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు రిమైండర్స్ యాడ్స్ వస్తుంటాయి. ఇకపై ఈ యాడ్స్‌ను మ్యూట్ చేసే సదుపాయాన్ని సెర్చింజన్ గూగుల్ కల్పించింది. త్వరలో ''మ్యూట్ దిస్ యాడ్'' పేరుతో ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ ప్ర‌వేశ‌పెట్టింది.

ప్రస్తుతానికి కొన్ని వెబ్‌సైట్లకు ఈ ఫీచర్‌ను గూగుల్ పరిమితం చేయగా, త్వరలో జీ-మెయిల్‌, యూట్యూబ్ ప్రకటనలకు కూడా ఈ ఫీచర్‌ను వర్తింపజేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
రిమైండ‌ర్ యాడ్స్ కార‌ణంగా గ‌తంలో యూజ‌ర్ సెర్చ్ చేసిన విష‌యాల‌ను గుర్తుచేయడం ద్వారా కొందరు యూజర్లు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో.. గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు సమాచారం. 
 
తొలిసారిగా ప్ర‌క‌ట‌న‌ల‌ను మ్యూట్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ 2012లో ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ ఫీచర్‌ను ఎవ్వరూ పెద్దగా ఉపయోగించలేదు. ఇకపై ఈ ఫీచర్‌ను గూగుల్ అమల్లోకి తేవడం ద్వారా.. యూజర్లకు రిమైండర్స్ యాడ్ తలనొప్పి తగ్గే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments