Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్​ మెసేజెస్​ యాప్​ నుంచి సరికొత్త అప్​డేట్​..

Webdunia
గురువారం, 1 జులై 2021 (11:14 IST)
గూగుల్​ మెసేజెస్​ యాప్​ సరికొత్త అప్​డేట్​ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేసే ఈ గూగుల్ మెసేజెస్ యాప్​ ద్వారా పర్సనల్​, ట్రాన్సాక్షన్​/ ప్రమోషనల్​ యాప్స్​ను వేరు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక, ట్రాన్సాక్షన్​ ధృవీకరణ కోసం వచ్చే "OTP" మెసేజ్‌లను ఆటోమేటిక్​గా 24 గంటల్లో డిలీట్​ చేసుకునే ఫీచర్​ను రోలవుట్ చేసింది. 
 
సాధారణంగా మన ఫోన్​కు ప్రతి రోజు పదుల సంఖ్యలో మెసేజ్‌లు​ వస్తుంటాయి. పర్సనల్, ప్రమోషన్​/ట్రాన్సాక్షన్​ మెసేజ్‌లు పెద్ద ఎత్తున్న రావడంతో ఇన్​బాక్స్​ నిండిపోతుంది. అవసరం లేని వాటిని డిలీట్​ చేయడం పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. అందువల్ల, చాలా మంది వాటిని డిలీట్​ చేయకుండానే వదిలేస్తుంటారు. ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టెక్​ దిగ్గజం గూగుల్​ కొత్తగా రెండు ఫీచర్లను తీసుకొచ్చింది.
 
ఈ ఫీచర్ ముఖ్యమైన మెసేజెస్​ను గుర్తించి.. అవసరం లేని వాటిని ఆటోమేటిక్​గా డిలీట్​ చేస్తుంది. అంతేకాక, పర్సనల్​, ప్రమోషనల్ మెసేజెస్​ను వేర్వేరు కేటగిరీలుగా విభజిస్తుంది. మెషిన్​ లెర్నింగ్​ టెక్నాలజీతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. 
 
ఇక వన్-టైమ్ పాస్వర్ట్​లు (OTP) ఒక్కసారికే పనిచేస్తాయి. వాటిని మన ఫోన్​లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వీటిని 24 గంటల్లో ఆటోమేటిక్​గా డిలీట్​ చేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు అవసరం లేని మెసేజెస్​ డిలీట్​ కావడం ద్వారా ఫోన్​ స్టోరేజీ ఆదా అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments