Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ నుంచి ఆ పదాలను తొలగించాం.. ఇక వెతికినా లాభం వుండదు: శ్రీధర్

సెర్చ్ ఇంజిన్ గూగుల్ సమస్యాత్మకంగా మారిన పలు పదాలను తొలగించింది. సెర్చింజన్‌లోని కీవర్డ్ జాబితా నుంచి వై డూ జ్యూ రుయిన్ ఎవ్రీథింగ్, ద ఎవిల్ జ్యూ, బ్లాక్స్‌ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్, జెవిష్ కంట్రోల్ ఆఫ్ బ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:10 IST)
సెర్చ్ ఇంజిన్ గూగుల్ సమస్యాత్మకంగా మారిన పలు పదాలను తొలగించింది. సెర్చింజన్‌లోని కీవర్డ్ జాబితా నుంచి వై డూ జ్యూ రుయిన్ ఎవ్రీథింగ్, ద ఎవిల్ జ్యూ, బ్లాక్స్‌ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్, జెవిష్ కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్ వంటి పదాలను గూగుల్ తొలగించినట్లు గూగుల్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ రామస్వామి తెలిపారు.

జాత్యహంకారానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు గూగుల్‌లో వుండటంతో పాటు వాటిని  సెర్చ్ పదాలతో కొందరు నెటిజన్లు వెతకడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆ పదాలను తొలగించినట్లు శ్రీధర్ వెల్లడించారు.
 
ఈ క్రమంలో బ్లాక్స్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్, జెవిష్ కంట్రోల్ ఆఫ్ బ్యాంక్స్ వంటి పదాలను సెర్చ్ చేసినా ఇకపై ఉపయోగం ఉండదని.. వాటిని గూగుల్ నుంచి తొలగించామని శ్రీధర్ చెప్పుకొచ్చారు.

ఈ పదాలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా వుండటంతో ఆ పదాలకు తాము మద్దతు పలికేది లేదని, జాతి విద్వేషానికి ఏ సంస్థకానీ, వ్యక్తికానీ సహకరించే ప్రసక్తే వుండదని శ్రీధర్ స్పష్టం చేశారు. 
 
కాగా జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌లో జాత్యహంకార అంశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక యాడ్ కీ వర్డ్స్‌ను నెటిజన్లు వెతుకుతుండటంపై దీనిపై జాతి వివక్ష దాడులకు గురైన వారితో పాటు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో ఆ పదాలను కీ వర్డ్స్ జాబితా నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments