Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గూగుల్ డాక్ ఫైళ్ళ'తో జీమెయిల్‌ ఖాతాలపై దాడి.. హ్యాకర్ల కొత్తరకం అటాక్

ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) రెచ్చిపోతున్నారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తాజాగా గూగుల్ డాక్ ఫైళ్ళతో జీమెయిల్ ఖాతాలపై దాడి చేస్తున్నారు.

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (15:45 IST)
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) రెచ్చిపోతున్నారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తాజాగా గూగుల్ డాక్ ఫైళ్ళతో జీమెయిల్ ఖాతాలపై దాడి చేస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లు పంపినట్లుగా జీమెయిల్‌ ఖాతాదారులను నమ్మిస్తూ వారి ఖాతాలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ఐటీ నిపుణులు గుర్తించారు. 
 
'ఫలానా వ్యక్తి ఈ ఫైల్‌ను షేర్‌ చేశాడు. ఆ ఫైల్‌ను గూగుల్‌ డాక్స్‌లో ఓపెన్‌ చేయండి' అంటూ హ్యాకర్లు కొన్ని లింకులు మన జీమెయిల్‌కు పంపుతారు. ఆ లింకును క్లిక్‌ చేసినట్టయితే 'అనుమతించు' అనే బటన్‌ వస్తుంది. ఆ బటన్‌ను నొక్కితే చాలు.. మన గూగుల్‌ ఖాతాను పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరికీ మన పేరుతోనే ఆ ప్రమాదకర ఈమెయిల్‌ వెళ్తుందట. దాంతో ఇతరులు కూడా హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 
 
జీమెయిల్‌ ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ కొత్తరకం దాడుల విషయంపై గూగుల్‌ స్పందించింది. గూగుల్‌ డాక్స్‌ రూపంలో వస్తున్న నకిలీ ఈమెయిళ్లపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. అలాంటి లింకులను క్లిక్‌ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని ట్విట్టర్‌లో కోరింది. 
 
పొరపాటు ఎవరైనా అలాంటి లింకులను క్లిక్‌ చేసివున్నట్టయితే, గూగుల్‌ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఖాతాకు ఏఏ యాప్‌లు అనుసంధానమై ఉన్నాయో చూసుకోవాలి. అందుకోసం గూగుల్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యి.. ‘సెక్యూరిటీ అండ్‌ కనెక్టెడ్‌ యాప్స్‌’ అనే ట్యాబ్‌ క్లిక్‌ చేయాలి. అందులో ‘గూగుల్‌ డాక్స్‌’ కనిపిస్తే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments