Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగికి షాకిచ్చిన గూగుల్.. చెప్పా పెట్టకుండా జంప్ ఐతే?

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (17:47 IST)
ఉద్యోగికి గూగుల్ సంస్థ ఏకంగా రూ.1300కోట్ల జరిమానా విధించింది. నిబంధనలను అతిక్రమించిన కారణంగా గూగుల్ సంస్థ ఉద్యోగికి భారీ మొత్తాన్ని జరిమానాగా విధించింది. గూగుల్ రూల్స్‌కి వ్యతిరేకంగా మరో కంపెనీలోకి వెళ్లిన ఓ టెక్కీకి ఈ ఇబ్బంది తప్పలేదు. 
 
చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేసి వేరొక కంపెనీకి జంప్ కావడం ముమ్మాటికీ తప్పే అని గూగుల్ కంపెనీ అంటోంది. అంతేకాదు.. ఉద్యోగం మారిన ఉద్యోగిపై కోర్టుని ఆశ్రయించింది. కోర్టు అతగాడికి రూ.1300 కోట్లు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని గూగుల్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది. 
 
ఇంతకీ ఏమైందంటే..? ఆంటోనీ లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్ లో ఇంజనీర్గా పనిచేసేవాడు. అతను గూగుల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఉబర్ నుంచి మరో మంచి ఛాన్స్ రావడంతో గూగుల్‌కు బై చెప్పేశాడు. కానీ గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మర్చిపోయాడు.
 
గూగుల్ ఎన్ని చేసినా కూడా మంచి ఆఫర్ రాగానే.. నిబంధనలు కూడా పాటించకుండా మానేయడంతో.. తమ కంపెనీ రహస్యాల్ని దొంగిలించి వెళ్లిపోయాడని ఆంటోనీ పై కోర్టులో కేసు వేసింది. ఈ విషయం తెలుసుకుని ఆ ఉద్యోగి షాకయ్యాడు. 
 
గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలో అయన పనికి మెచ్చి కంపెనీ ఒకసారి ఏకంగా 120 మిలియన్ డాలర్స్ బోనస్‌గా ఇవ్వడం గమనార్హం. మరి గూగుల్‌కు కోర్టు విధించిన జరిమానాను కడుతాడో లేకుంటే గూగుల్‌లోనే  కొనసాగుతాడో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments