Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా కాదు గిమెరికా కూడా మనల్ని ఏమీ చేయలేదు.. ఐటీ నిపుణులకు లక్షలాది అవకాశాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు, ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ దెబ్బకు ఐటీ పరిశ్రమ కుదేల్ అని వణుకుతున్న భారతీయ టెకీలకు కమ్మటి వార్త. కంపెనీలు ఉద్యోగులను పెరికి వేసే ట్రెండ్ కాస్త లక్షలాది ఐటీ నిపుణులను

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (05:40 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు, ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ దెబ్బకు ఐటీ పరిశ్రమ కుదేల్ అని వణుకుతున్న భారతీయ టెకీలకు కమ్మటి వార్త. కంపెనీలు ఉద్యోగులను పెరికి వేసే ట్రెండ్ కాస్త లక్షలాది ఐటీ నిపుణులను కొత్తగా ఉద్యోగాల్లోకి నియమించుకునే ట్రెండ్‌గా మారనున్నట్లు శుభ వార్తలొస్తున్నాయి. ఎక్కడ కోల్పోతామో అక్కడే అవకాశాలను వెదుక్కోవాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడు నారాయణ మూర్తి చెప్పిన  మాటలు అక్షర సత్యాలుగా నిరూపితం అవుతున్నాయి. ఉద్యోగాలు ఎన్నాళ్లు ఉంటాయో, ఊడతాయో తెలీకుండా కలవరపడుతున్న భారతీయ నిపుణులకు  అదే ఐటీరంగంలో ఓ అపూర్వ అవకాశం తన్నుకుంటూ వచ్చేస్తోంది.

 
ఐటీ పరిశ్రమలో భారీ  ఎత్తున్న ఉద్యోగవకాశాలు కల్పించడానికి బిగ్‌ డేటా అనాలిటిక్స్‌ రంగంలోకి వచ్చేసిందని ఇండస్ట్రి నిపుణులు చెప్పారు. వచ్చే 2025 కల్లా ఈ రంగం ఎనిమిదింతల వృద్ధి సాధించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న బిగ్‌ డేటా అనాలిటిక్స్‌ రంగం వృద్ధి వచ్చే ఏళ్లలో 16 బిలియన్‌ డాలర్లకు(రూ.లక్ష కోట్లకు) ఎగయనుందని ఇండస్ట్రి నిపుణులు తెలిపారు. 
 
ప్రస్తుతం బిగ్‌ డేటా అనాలిటిక్స్‌లో భారత్‌, ప్రపంచంలో టాప్‌10లో ఉన్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో భారత్‌ను టాప్‌-3లో నిలపాలని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. బిగ్‌డేటా అనాలిటిక్స్‌లో ఎనిమిది స్పెషలైజేషన్స్‌లో ఎక్కువగా వృద్ధి ఉన్నట్టు నాస్కామ్‌ గుర్తించింది. అవి బిజినెస్‌ అనాలిస్టులు, సొల్యుషన్‌ అర్కిటెక్ట్స్‌, డేటా ఇంటిగ్రేటర్లు, డేటా ఆర్కిటెక్ట్స్‌, డేటా అనాలిస్టులు, డేటా సైంటిస్టులుగా నాస్కామ్‌ పేర్కొంది. 
 
నాస్కామ్‌ ప్రకారం అనాలిటిక్స్‌ ఎగుమతుల మార్కెట్‌ 2017లో కనీసం 20 శాతం వృద్ది సాధించనున్నట్టు వెల్లడైంది. ఇది మొత్తం ఐటీ ఎగుమతుల కంటే కూడా అ‍త్యధికమని నాస్కామ్‌ పేర్కొంది. భారీ ఎత్తున వృద్ధి ఉద్యోగవకాశాలను కూడా ఈ రంగం సృష్టించనుందని అనాలిటిక్స్‌ ఇండియా మేగజీన్‌ అధ్యయనం తెలిపింది. గత ఏడాది కాలంలో దీనిలో ఉద్యోగాల రెండింతలయ్యాయని వెల్లడించింది. ప్రస్తుతం 50వేల పొజిషన్లు అనాలిటిక్స్‌కు సంబంధించినవే ఉన్నాయని అనాలిటిక్స్‌ అండ్‌ డేటా సైన్సు ఇండియా జాబ్స్‌ స్టడీస్  2017 అంచనా వేసింది.    
 
పేరు ఏదైతేనేం.. రంగం ఏదైతేనేం.. గొడ్డు చాకిరీ చేయడంలో భారతీయులే నెంబర్ వన్ కాబట్టి బిగ్‌ డేటా అనాలిటిక్స్‌‌లో కూడా మనదే రాజ్యమని ప్రకటించడానికి ఇంకా ఏమైనా రుజువులు కావాలా?
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments