ఇన్ఫోసిస్‌ను గాడిలో పెట్టేందుకే వచ్చా : నందన్ నీలేకని

ఇన్ఫోసిస్ కొత్త ఛైర్మెన్‌గా నందన్ నీలేకని రీ ఎంట్రీ ఇచ్చారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడానికి ఇన్ఫోసిస్‌ కొత్త చైర్మన్‌గా నందన్‌ నిలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఆర్‌.శేషసాయి స్థా

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (12:07 IST)
ఇన్ఫోసిస్ కొత్త ఛైర్మెన్‌గా నందన్ నీలేకని రీ ఎంట్రీ ఇచ్చారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడానికి ఇన్ఫోసిస్‌ కొత్త చైర్మన్‌గా నందన్‌ నిలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఆర్‌.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. గురువారం ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నిలేకని ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తూ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
వ్యవస్థాపకులకు, కంపెనీకి మధ్య స్థిరత్వం సంపాదించడమే లక్ష్యంగా తాను ఇన్ఫీలోకి అడుగుపెట్టినట్టు నిలేకని చెప్పారు. కంపెనీని గాడిపెట్టిన అనంతరమే తాను ఇన్ఫీ నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తన పాత్ర బోర్డు పర్యవేక్షణ, పాలన, పనితీరు పరంగా ఉంటుందన్నారు.
 
విశాల్‌ సిక్కా రాజీనామా అనంతరం ఆ పదవిలోకి తీసుకురాబోయే కొత్త సీఈవోగా కోసం కంపెనీ వెలుపల, లోపల వ్యక్తులను వెతుకుతున్నామని చెప్పారు. కొత్త సీఈవో అందరి వాటాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ టెక్నాలజీ పరంగా బలమైన పట్టు ఉండాలన్నారు. కొత్త సీఈవో ఎంపిక కోసం సెర్చ్‌ కమిటీని త్వరలోనే నియమిస్తామన్నారు. 
  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments