Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్ జీ కాదు.. ఫౌ-జి గేమ్ లాంఛ్.. గాల్వన్‌ లోయ నేపథ్యంలో గేమ్‌

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (12:07 IST)
FAU-G Game
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం పబ్‌జి సహా అనేక యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్‌జి గేమ్‌ను ఇండియన్‌ వెర్షన్‌లోకి మార్చి మళ్లీ పబ్‌జి కార్ప్‌ ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నించింది. కానీ పబ్‌జి మొబైల్‌ ఇండియన్‌ వెర్షన్‌కు ఇంకా అనుమతి లభించలేదు. కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్టకేలకు మంగళవారం ఈ గేమ్‌ గేమింగ్‌ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.
 
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫౌ-జి గేమ్‌ లాంచ్‌ అయింది. ఈ గేమ్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఆండ్రాయిడ్‌ 8.0 ఆపైన వెర్షన్‌ ఉన్న ఫోన్లలో ఈ గేమ్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపై కూడా ఈ గేమ్‌ను లాంచ్‌ చేయనున్నారు.
 
ఇప్పటికే ఫౌ-జి గేమ్‌కు చెందిన టీజర్‌, ట్రైలర్లు గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకున్నాయి. ముందుగా గాల్వన్‌ లోయ నేపథ్యంలో యూజర్లు గేమ్‌ ఆడవచ్చు. తరువాత పబ్‌జి తరహాలో బ్యాటిల్‌ రాయల్‌ మోడ్‌ను అందుబాటులోకి తెస్తారు. అయితే ఫౌ-జి గేమ్‌ ఇండియన్‌ గేమింగ్‌ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments