Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బెర్రీ వ్యాపారులకు షాకిచ్చిన ఫేస్‌బుక్ అధినేత... ఎందుకు?

Webdunia
సోమవారం, 21 మార్చి 2016 (11:27 IST)
బ్లాక్‌బెర్రీ ఫోన్ల వ్యాపార వేత్తలు ఇప్పుడు షాక్ మీదున్నారు. వీరికి షాక్ ఇచ్చింది ఎవరో కాదు ఫేస్‌బుక్ సంస్థ. ఏం జరిగిందో ఏమో కాని ఫేస్‌బుక్‌ మాత్రం ఇకపై బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లకు ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చేది లేదని స్పష్టంచేసింది. బ్లాక్‌బెర్రీ 10తోపాటు బిబిఓఎస్‌ ప్లాట్‌ఫారమ్స్‌ల కోసం ముఖ్యమైన ఏపీఐలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. వాట్సాప్‌ కూడా ఫేస్‌బుక్‌‌కి అనుబంధ సంస్థే కాబట్టి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు సంబంధించిన యాప్స్‌ ఇకపై బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్లకు పనిచేయవట.
 
ఇంతకీ వీరి మధ్య గొడవేంటంటే, బ్లాక్‌బెర్రీ ఇటీవల అధికారిక బీబీ ఫేస్‌బుక్‌ యాప్‌ స్థానంలో చాలా సింపుల్‌ వెబ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించే లోకల్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడమే దీనికి ముఖ్య కారణం. దీంతో బ్లాక్‌బెర్రీ యూజర్లు కూడా ఫేస్‌బుక్‌ యాప్‌ కన్నాఈ లోకల్‌ యాప్‌ బాగుందని దీనికే మద్దతునివ్వడం ఇంకొక కారణం. దీంతో ఫేస్‌బుక్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఎఫ్‌బితోపాటు వాట్సాప్‌ సర్వీసులు బ్లాక్‌బెర్రీలో ఉండవని ఫేస్‌బుక్ సంస్థ తేల్చిచెప్పేసింది. 
 
ఫేస్‌బుక్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేం చాలా అసంతృప్తి చెందామని బ్లాక్‌బెర్రీ అధికారులు ప్రకటించారు. ఫేస్‌బుక్‌ తాజా నిర్ణయంతో బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్‌బెర్రీ 7.1 హ్యాండసెట్లలో మార్చినెల చివరలో ఫేస్‌బుక్‌ ఖాతా ఉండవని బ్లాక్‌బెర్రీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఎందుకంటే ఈ యాప్‌ల పట్ల చాలా మంది యూజర్లు సుముఖంగా ఉంటారని మాకు తెలుసు. అయినా మేం పోరాడుతాం. వినియోగదారులను పూర్తిగా సంతృప్తి పరిచేవిధంగా అన్నిరకాలుగా కృషి చేస్తామని ఫేస్‌బుక్‌ కళ్లు తెరిపిస్తాం' అని బ్లాక్‌బెర్రీ అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments