Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో ట్యాబ్ 'వాచ్'

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపేరు వీడియో ట్యాబ్ వాచ్.

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (12:45 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన వినియోగదార్ల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇది యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపేరు వీడియో ట్యాబ్ వాచ్. 
 
తమ వీడియో ఆఫర్స్‌ను మరింత విస్తరిస్తూ టెలివిజన్‌ మార్కెట్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ దీన్ని లాంచ్‌ చేసింది. ప్రొఫెషనల్‌ ఉమెన్స్‌ బాస్కెట్‌బాల్‌ నుంచి సఫారీ షోల వరకు అన్ని రకాల వీడియో ప్రొగ్రామ్‌లను ఇది ఆఫర్‌ చేయనుంది. రీడిజైన్ చేసిన ఈ ప్రొడక్ట్‌ 'వాచ్‌' ప్రస్తుతం అమెరికాలోని ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌, టెలివిజన్‌ యాప్లు వాడుతున్న పరిమిత గ్రూపు సభ్యులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. 
 
కాగా, గతేడాదే ఈ వీడియో ట్యాబ్‌ను ఫేస్‌బుక్‌ లాంచ్‌ చేసిన విషయం తెల్సిందే. మేలోనే ఫేస్‌బుక్‌ మిలినీయల్‌ ఫోకస్డ్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ క్రియేటర్స్‌ వోక్స్‌ మీడియా, బుజ్‌ఫీడ్‌, ఏటీటీఎన్‌, గ్రూప్‌ నైన్‌ మీడియా, ఇతర వాటితో ఒప్పందాలు చేసుకుంది. 
 
స్క్రిప్ట్‌, స్క్రిప్ట్‌లేని షోలను ప్రొడ్యూస్‌ చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకుంది. న్యూస్‌ ఫీడ్‌లో ప్రజలు ఎక్కువగా వీడియోలను చూసేందుకు ప్రజలు ఇష్టపడతారని తాము తెలుసుకున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ డైరెక్టరర్‌ డానియల్‌ డాంకర్‌ చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments