Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే?

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై యూరోపియన్ యూనియన్ సుదీర్ఘ విచారణ జరిపింది. చివరకు

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (18:28 IST)
గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై యూరోపియన్ యూనియన్ సుదీర్ఘ విచారణ జరిపింది. చివరకు గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ సంస్థ ఏకంగా 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. గూగుల్ త‌మ సెర్చింజ‌న్‌లో చూపించిన ఆన్‌లైన్ షాపింగ్‌ స‌ర్వీస్ సంస్థ‌ల పేర్లు ఇత‌ర సంస్థ‌ల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని తేల్చింది.
 
సెర్చ్ ఇంజిన్‌గా పేరు కొట్టేసిన గూగుల్ సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీసులనే ప్రమోట్ చేసి.. ప్ర‌త్య‌ర్థి కంపెనీల డీమోట్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు గూగుల్‌పై ఉన్నాయి. తన ఆండ్రాయిడ్‌ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి  ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్లుగా గూగుల్‌పై ప‌దుల సంఖ్య‌లో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వ‌స్తున్న సంగతి తెలిసిందే.  
 
దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈయూ యాంటీట్ర‌స్ట్ విభాగం భారీ జ‌రిమానా విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌లకు ఫేవ‌ర్ చేయ‌డాన్ని నిలిపేయాల‌ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్ర‌తిరోజూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వ‌చ్చే ట‌ర్నోవ‌ర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments