Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం.. మరోమార్గం లేకే తీసివేతలు : ఎలాన్ మస్క్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:32 IST)
ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. రోజుకు 40 లక్షల డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూస్తున్నామని, అందువల్లే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 180 మందిని తొలగించారు. అలాగే, ఇతర దేశాల్లో కూడా ఈ తీసివేతలు కొనసాగుతున్నాయి. ఆయన ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‍పై చర్యలు తీసుకున్నారు. ఇపుడు కింది స్థాయిలో ఉద్యోగులపై దృష్టిసారించారు. వీటిపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఎలాన్ మస్క్ స్పందించారు. 
 
ట్విట్టర్ రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతుందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని చెప్పారు. మూడు నెలల పాటు వారికి సగం కంటే ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments