Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫారిన్ టూరిస్టుల కోసం e-visa సేవలు ప్రారంభం!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (19:35 IST)
ఫారిన్ టూరిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వీసా సేవలను ప్రవేశపెట్టింది. ఈసేవలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సేవల వల్ల 43 దేశాలకు చెందిన పర్యాటకులకు వెసులుబాటు లభించనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. 
 
ఇందులోభాగంగా తొలిదశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్‌తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఈ-వీసా అందుబాటులోకి రానుంది. భారత్‌లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు. దేశ జీడీపీలో 7 శాతం పర్యాటక రంగం నుంచే వస్తోందని, దీన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
విదేశీ పర్యాటకులు ఈ-వీసా కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా పరిష్కరిస్తారని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, యూఏఈ, జోర్దాన్, కెన్యా, ఫిజీ, ఫిన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, మారిషస్, మెక్సికో, నార్వే, ఒమన్, ఫిలిప్ఫీన్స్ తదితర దేశాల యాత్రికులకు ఈ సౌకర్యం కల్పించారు. ‘హై రిస్క్’ దేశాలను మినహాయించి దశలవారీగా అన్ని దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments