ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కెనడాకు చెందిన డేటా విండ్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ డీల్‌లో భాగంగా ఈ సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కెనడాకు చెందిన డేటా విండ్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ డీల్‌లో భాగంగా ఈ సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించనున్నట్టు డేటావిండ్ తెలిపింది.
అంటే నెలకు రూ.30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని డేటావిండ్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.