Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాగ్నిజెంట్ సుతిమెత్తని హెచ్చరిక... 9 నెలల జీతాలిస్తాం... బుద్ధిగా వెళ్ళిపోండి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఐటీ కంపెనీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న వర్క్ ఫోర్స్‌ (ఉద్యోగులు)ను తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వ

Webdunia
గురువారం, 4 మే 2017 (14:02 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఐటీ కంపెనీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న వర్క్ ఫోర్స్‌ (ఉద్యోగులు)ను తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయాలన్న కఠిన నిర్ణయానికి వచ్చేశాయి. దీనికి నిదర్శనం ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ చేసిన సుతిమెత్తని హెచ్చరిక. 
 
‘డి ప్లస్’ కేటగిరి ఉద్యోగులకు మంగళవారం రాత్రి పంపిన మెయిల్స్‌లో సుహృద్భావ వాతావరణంలో సంస్థను విడిచిపెట్టేందుకు సిద్ధం కావాలని కోరింది. ఈ కేటగిరీలోకి డైరెక్టర్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వస్తారు. ఉద్యోగుల కేటగిరినిబట్టి 6 లేదా 9 నెలల జీతాన్ని తీసుకుని స్నేహపూర్వకంగా సంస్థ నుంచి వెళ్ళిపోవాలని కాగ్నిజెంట్ కోరింది. డైరెక్టర్లకు 9 నెలల జీతం, ఏవీపీలు, ఎస్‌వీపీలకు 6 నెలల జీతం ఇస్తామని ప్రకటించింది.
 
దీనిపై కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. "కొందరు అర్హులైన లీడర్లకు స్వచ్ఛంద ఎడబాటు ప్రోత్సాహకాలను ఇవ్వజూపుతున్నాం. వీరు మా మొత్తం ఉద్యోగ బృందంలో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారు. అత్యున్నత ప్రమాణాలను అందజేసేందుకు, సుస్థిర వృద్ధికి, డిజిటల్‌వైపు వేగంగా మళ్ళేందుకు కంపెనీ అనుసరిస్తున్న వ్యూహానికి సంబంధించిన నిర్ణయమిది" అని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments