Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో మరో ఉచిత ఆఫర్... పైసా చెల్లించకుండా...

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో టెలికాం కంపెనీ తన మొబైల్ వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. పైసా ఖర్చు లేకుండానే కాలర్ ట్యూన్స్ పెట్టుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:10 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో టెలికాం కంపెనీ తన మొబైల్ వినియోగదారులకు మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. పైసా ఖర్చు లేకుండానే కాలర్ ట్యూన్స్ పెట్టుకునే సౌలభ్యాన్ని కల్పించింది. 
 
దేశీయంగా ఈ కంపెనీ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీతో పాటు.. ధరలు, ఆఫర్ల యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వివిధ రకాల ఆఫర్లతో రిలయన్స్ జియో ఇతర టెలికాం కంపెనీలను బెంబేలెత్తిస్తోంది. 
 
తాజాగా మరో ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండానే కాలర్ ట్యూన్స్‌ను పొందే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. జియో ట్యూన్ సర్వీస్ ద్వారా కాలర్ ట్యూన్స్‌ను సెట్ చేసుకోవచ్చని జియో తెలిపింది. 
 
జియో మ్యూజిక్ యాప్‌లో ఈ ఆప్షన్ ఉంటుందని వెల్లడించింది. వాస్తవానికైతే ఈ కాలర్ ట్యూన్స్‌కు నెలవారీ ఛార్జీలను టెలికాం సంస్థలు వసూలు చేస్తున్నాయి. కానీ, జియో ఈ కాలర్ ట్యూన్స్‌ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments