Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ లక్ష్మీ ప్రమోషనల్: అదనంగా 50 శాతం టాక్ టైమ్

దీపావళి పండుగను పురస్కరించుకుని టెలికాం సంస్థలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఈ-కామర్స్‌లో బంపర్ ఆఫర్ల సేల్ ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (11:00 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని టెలికాం సంస్థలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఈ-కామర్స్‌లో బంపర్ ఆఫర్ల సేల్ ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళిని పండుగ సందర్భంగా ‘లక్ష్మీ ప్రమోషనల్’ పేరిట అదనపు టాక్ టైం రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టింది. 
 
ఇందులో భాగంగా రూ.290, రూ.390, రూ.590 టాప్ అప్‌లపై అదనంగా 50 శాతం టాక్ టైమ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు టాప్ అప్‌లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. రూ.290 రీచార్జ్‌పై రూ.435, రూ.390 రీచార్జ్‌పై రూ.585, రూ.590 రీచార్జ్‌పై రూ.885 టాక్ టైంను అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఈ ఆఫర్ ఈనెల 16 నుంచి 21 మధ్య రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
మరోవైపు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు వందశాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌పై ఏడీఎస్‌ఎల్‌ వైఫై మోడెమ్‌ను అందిస్తున్నట్లు రాష్ట్ర టెలికం సర్కిల్‌ సీజీఎం అనంతరామ్‌ తెలిపారు. రూ.1,500 విలువ గల మోడెమ్‌పై ప్రతినెల రూ.50 చొప్పున 30 నెలల పాటు కనెక్షన్‌ బిల్లులో మినహాయిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఈ ఆఫర్‌ 2018 జనవరి వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments