Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఒక్క రూపాయికే 1 జిబి డేటా

దేశంలో టెలికామ్ కంపెనీల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైంది. సంచలన ఆఫర్లతో ముందుకువచ్చి ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సేవలందిస్తున్నట్లు ప్రకటించిన రిలయన్స్ జియోకు ప్రభుత్వ రంగ టెలికామ్ కంపెనీ బీఎస్ఎన్ఎల్ త

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (09:37 IST)
దేశంలో టెలికామ్ కంపెనీల మధ్య ధరల యుద్ధం ప్రారంభమైంది. సంచలన ఆఫర్లతో ముందుకువచ్చి ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సేవలందిస్తున్నట్లు ప్రకటించిన రిలయన్స్ జియోకు ప్రభుత్వ రంగ టెలికామ్ కంపెనీ బీఎస్ఎన్ఎల్ తేరుకోలేని షాకిచ్చింది. 
 
జియో దెబ్బకు అన్ని కంపెనీలు గల్లంతే అనుకుంటున్న తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్ తాజా ప్రకటనతో మరో సంచలనానికి తెరలేపింది. జియోకు ధీటుగా 249 రూపాయలకే నెల రోజుల కాలపరిమితితో అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు, 50 రూపాయలకు 1జిబి అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియోకు పోటీగా 1 రూపాయికే 1జిబి అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
 
1జీబీ ఉన్న ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటే కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాత్సవ తెలిపారు. అయితే ఈ అపరిమిత డేటా ఆరునెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నిర్దిష్ట చార్జీలు వర్తిస్తాయని ఆయన వివరించారు. కేవలం బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని శ్రీవాత్సవ చెప్పారు. 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ సేవలు ఈనెల 9వ తేదీ నుంచి వినియోగదారులు పొందవచ్చని తెలిపారు.
 
అంతకుముందు జియో కంపెనీ 50 రూపాయలకే 1జిబి 4జీ డేటా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో టెలికామ్ రంగాన్ని శాసిస్తూ వచ్చిన ఎయిర్‌టెల్, ఐడియా కంపెనీలు కొన్ని నిమిషాల వ్యవధిలో వందల కోట్ల రూపాయల మేరకు నష్టాలను చవిచూసింది. ఇపుడు బీఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయం జియోకు షాకిచ్చేలా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments