Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో బీఎస్ఎన్ఎల్ 4జీ ఎల్‌టీఈ సేవలు ప్రారంభం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సేవలను ముందుగా కేరళలో ప్రారంభించనుంది. ఆపై ఒడిషాలో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా 3జీ కవరేజీ తక్క

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (13:21 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ ఎల్‌టీఈ సేవలను ముందుగా కేరళలో ప్రారంభించనుంది. ఆపై ఒడిషాలో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా 3జీ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను మొదలెట్టనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు. 
 
ఎల్‌టీఈ సేవ‌లు అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు అత్యుత్త‌మ డేటా వేగాన్ని అందించే అవ‌కాశం క‌లుగుతుందని శ్రీవాత్సవ తెలిపారు. ఈ సేవలను కేరళ, ఒడిషాల తర్వాత దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందించి.. తద్వారా ప్రైవేట్ టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, జియోల‌తో పోటీని ఎదుర్కోవాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. 
 
ఎయిర్‌టెల్, జియో వొడాఫోన్‌ నుంచి ఎదురయ్యే పోటీని 4జీ సేవలు లేకపోవడంతో బీఎస్ఎన్ఎల్ తట్టుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు లేకపోవడంతో వెనకబడాల్సి వచ్చింది. ఇకపోతే.. బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా (ముంబై, ఢిల్లీ సర్కిల్స్ మినహా) పది కోట్ల వినియోగదారులున్నారు. 4జీ ఎల్‌ఈటీ సేవల కోసం మార్చి 2018 నాటికి పదివేల 4జీ మొబైల్ టవర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments