Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లు..

దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్తగా మూడు ఆఫర్లను ప్రకటించింది. ఇవి మూడు జియోకు షాకిచ్చేలా ఉన్నాయి. రూ.333 ప్లాన్‌ను తీసు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (13:31 IST)
దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్తగా మూడు ఆఫర్లను ప్రకటించింది. ఇవి మూడు జియోకు షాకిచ్చేలా ఉన్నాయి. రూ.333 ప్లాన్‌ను తీసుకొన్న బిఎస్ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రతి రోజూ 3 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇది 90 రోజులవరకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను తీసుకొన్న కస్టమర్లకు 270 జీబీ హై వేగంతో 3 జీబీ డేటా అందుతోంది.
 
అలాగే, 'దిత్ కోల్ కే బోల్' పేరుతో రూ.349 ప్లాన్‌ను బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ పథకం కింద ఎస్టీడీతో పాటు లోకల్ కాల్స్‌ను కూడా అపరిమితంగా ఇవ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 2 జీబీ డేటాను 3జీబీ డేటా స్పీడ్‌తో ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ రిలయన్స్ జియో ధనాధన్ ఆఫర్ తరహాలోనే ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4 జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్ 84 రోజులపాటు ఉంటుంది.
 
చివరగా, రూ.395 ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ 3 వేల నిమిసాలపాటు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఫోన్లకు ఉచితంగా మాట్లాడుకొనే సౌకర్యాన్ని కల్పించింది. మరో వైపు 1800 నిమిషాల పాటు ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన కంపెనీల ఫోన్‌లకు ఉచితంగా మాట్లాడుకొనే వెసులుబాటు కల్పించింది. 2 జీబీ డేటాను 3 జీబీ స్పీడ్‌తో అందించనుంది బిఎస్ఎన్‌ఎల్. ఈ పథకం 71 రోజుల వరకు వర్తిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments