Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... రూ.99తో అపరిమిత కాల్స్...

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలు ఇప్పటికే అపరిమిత వాయిస్ కాల్స్‌ను తమ వి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (09:52 IST)
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలు ఇప్పటికే అపరిమిత వాయిస్ కాల్స్‌ను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. 
 
ఇపుడు ఈ కంపెనీల బాటలోనే ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని తెలిపింది. 
 
రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్ , బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రేట్ ఆఫర్ కోల్‌కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లు నెట్‌వర్క్ పరిధిలోని కాల్స్‌కు వర్తిస్తుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149లకు రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 
 
అలాగే, కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునేలా అవకాశంతో పాటు 1జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది 30 రోజుల పాటు వాలిడిటీ కలిగివుంటుంది. కాగా, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments